Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్గ్రూప్ -1 పేపర్ లిక్ సిత్రాలు..

గ్రూప్ -1 పేపర్ లిక్ సిత్రాలు..

టీఎస్ పీఎస్సీ ఉద్యోగులకు 100పైగా.. మార్కులు
ముగ్గురికి 120 ప్లస్..
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్‌ విచారణ వేగంగా సాగుతోంది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్‌-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్‌లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ప్రధాన నిందితులతో సంబంధాలు కొనసాగించి, లీకైన గ్రూప్‌-1 పేపర్‌తో పరీక్ష రాసిన వారి ఆధారాలు నిర్ధారించిన సిట్‌.. సురేశ్‌తోపాటు మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆ ముగ్గురి కోసం కోసం గాలింపు చేపట్టారు. గ్రూప్‌-1లో వంద మార్కులకుపైగా వచ్చిన దాదాపు 120 మందిని గుర్తించిన సిట్‌.. వారిని విచారిస్తోంది. ఇందులో 20 మంది టీఎస్‌ఎపీస్సీలో ఉద్యోగాలు చేస్తున్నవారే ఉండడం గమనార్హం. వారిలో 10 మంది క్వాలిఫై కాగా, ముగ్గురికి 120 కంటే ఎక్కువగా మార్కులు వచ్చాయి. వీరు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, మరొకరు పేపర్‌ కస్టోడియన్‌కు పరిచయస్థులని పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురికి గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ చేసి ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించి, వారిపై కూడా కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments