Tuesday, November 26, 2024
Homeకెరీర్గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానిక‌త వివాదంపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. అభ్యర్థి స్థానిక‌త వివాదంపై కౌంట‌ర్ దాఖాలు చేయాల‌ని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు విడుద‌ల చేసుకోవ‌చ్చని కోర్టు సూచించింది. అభ్యర్థి స్థానిక‌త వివాదం త‌ర్వాత తేలుస్తామ‌ని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టు‌లకు అక్టోబ‌ర్ 16న ప్రిలి‌మి‌న‌రీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల‌కు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది అభ్యర్థులు పరీ‌క్షకు హాజ‌ర‌య్యారు. అక్టోబ‌ర్ 29న ప్రాథ‌మిక కీని విడుద‌ల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంత‌రాల‌ను స్వీక‌రించింది టీఎస్‌పీఎస్సీ. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాల‌పై స‌బ్జెక్ట్ నిపుణుల క‌మిటీ సిఫార్సులు ప‌రిశీలించి, 5 ప్రశ్నల‌ను తొల‌గించారు. అనంత‌రం న‌వంబ‌ర్ 15వ తేదీన తుది కీని ప్రక‌టించారు. ఒక్కో ఉద్యో‌గా‌నికి 50 మందిని మెయి‌న్స్‌కు ఎంపిక చేయ‌ను‌న్నారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్‌ పరీ‌క్షకు అర్హత సాధి‌స్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments