మల్టీ జోన్ లో 93, రాష్ట్రస్థాయిలో 203వ ర్యాంకు
సోనికి పలువురి అభినందనలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండ టైలర్స్ స్ట్రీట్ కు చెందిన తోట దామోదర్ – జ్యోతి కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్రస్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జేఎన్ యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పీజీ పూర్తి చేసింది. అప్పటి నుంచి సివిల్స్ ప్రిపరేషన్ లో ఉంటూ తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్స్ కు కూడా ప్రిపేర్ అయ్యింది. ఈ క్రమంలో గ్రూప్-4లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం శాయంపేట ఎంజేపీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులను నిర్వహిస్తోంది. అలాగే ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 లో కూడా జోనల్ స్థాయిలో 3వ ర్యాంకు, గ్రూప్-3లో ఉద్యోగ అర్హత సాధించింది. జిల్లాలోని నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన టైలర్స్ స్ట్రీట్ లో చిన్న బియ్యం వ్యాపారం షాపు నిర్వహిస్తున్న తోట దామోదర్, జ్యోతి కూతురుగా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికై జిల్లాలో ఉత్తమ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు సాధించిన తోట సోనిని పలువురు అభినందించారు. భవిష్యతులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.
Recent Comments