కొత్త నోటిఫికేషన్ కు రెడీ అవుతున్న కమిషన్
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా సరైన నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు రద్దు చేసింది. ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు..
RELATED ARTICLES
Recent Comments