Friday, November 22, 2024
Homeతెలంగాణగ్రూప్-1 రద్దు సబబే..

గ్రూప్-1 రద్దు సబబే..

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
స్పాట్ వాయిస్, బ్యూరో: గ్రూప్1 రద్దును హైకోర్టు సమర్థిచింది. గ్రూప్-1 పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ చేపట్టి హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని స్పష్టం చేసింది. గ్రూప్1 కేసులో సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందేనని టీఎస్ పీఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ పెట్టకపోవడానికి తగిన కారణాలను టీఎస్పీఎస్సీ చూపలేదని హైకోర్టు తెలిపింది. మొదటిసారి బయెమెట్రిక్ పెట్టి.. రెండోసారి ఎందుకు పెట్టలేదని, ప్రశ్నించింది. 8 నెలల్లో ఎందుకు నిర్ణయం మారిందని నిలదీసింది. రాజ్యాంగబద్ధ సంస్థ ఇష్టానుసారం ఎలా వ్యవహరిస్తుందని అడిగింది. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ అప్పీలును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. టీఎస్ పీఎస్సీ పరీక్షను సరిగా నిర్వహించకపోవడంతో ఏండ్లుగా కష్టపడిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments