బిగ్ న్యూస్..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు హై కోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్.. పరీక్షను రద్దు చేస్తూ శనివారం ఉదయం తీర్పునిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్-11వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో బయోమెట్రిక్ వివరాలు సేకరించలేదని, హాల్ టికెట్ నంబర్, ఫొటో లేకుండా ఓఎంఆర్ షీటు ఇచ్చారని, ఈ పరీక్ష రద్దు చేయాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
గతంలో పేపర్ లీక్ కారణంతో గ్రూప్ వన్ రద్దు అయిన విషయం తెలిసిందే. రెండోసారి నిర్వహించిన పరీక్ష టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యంగా హైకోర్టు రద్దు చేసింది. ఇక మళ్లీ నిర్వహిస్తే ముచ్చటగా మూడోసారి రాయల్సిందే.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు..
RELATED ARTICLES
Recent Comments