అనుమతి లేకుండా కట్టినందుకు భారీ జరిమానా..
గుండా శ్రీనివాస్ కు రూ.20 వేల ఫైన్
పర్మిషన్ తప్పనిసరి.. బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి
స్పాట్ వాయిస్, కార్పొరేషన్: అనుమతి లేకుండా ఫ్లెక్సీల ఏర్పాటు చేసినందుకు రూ.20 వేలు జరిమానా విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. గురువారం కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకొని గుండా శ్రీనివాస్ అనే వ్యక్తి నగరంలో అనధికారికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు ఆయనకు రూ.20 వేల జరిమానా విధించినట్టు చెప్పారు. అనుమతులు లేకుండా బల్దియా పరిధిలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేస్తే ఒక్కో ఫ్లెక్సీ కి రూ.2 నుంచి 5 వేల వరకు ఫెనాల్టీ విధించడంతో పాటు చట్టం ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, ఇందుకోసం నగర ప్రజలు సహకరించాలని సీఎంహెచ్ఓ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Recent Comments