Friday, November 22, 2024
Homeరాజకీయంగ్రేటర్ పై కొండా చూపు..

గ్రేటర్ పై కొండా చూపు..

గ్రేటర్ పై కొండా చూపు

*ఆపరేషన్ ‘ఈస్ట్’ సక్సెస్

*హస్తం వైపు కార్పొరేటర్లు, నాయకులు

*సీఎం సమక్షంలో చేరనున్న 15 మంది

స్పాట్ వాయిస్, కార్పొరేషన్:
గ్రేటర్ వరంగల్ పీఠంపై కొండా దంపతులు దృష్టి సారించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని బీఆర్ ఎస్ కు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులతో తరచూ సమావేశం అవుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కూడా సమావేశం అయ్యారు. పార్టీలో చేరిన తరువాత ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని. గతంలో జరిగినట్లు పునరావృతం కావొద్దని కొండా దంపతుల నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వారి చర్చలు సఫలం అయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో కార్పొరేటర్లు, మాజీ కొర్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మొత్తం 15 మంది త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతామని కొండా దంపతులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు వరంగల్ పశ్చిమ నియోజవర్గంతోపాటు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐదారుగురు బీఆర్ ఎస్ కార్పొరేటర్లు సైతం హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని విశ్వనీయ సమాచారం. ఆ తతంగం అంతా పూర్తయిన తరువాత కాంగ్రెస్ బలాన్ని బేరీజు వేసుకుని, మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా గ్రేటర్ వరంగల్ పాలకవర్గం ఏర్పడి వచ్చే మే నెలతో మూడేళ్లు పూర్తికానున్నాయి. పార్టీలో చేరికల తరువాత అంతా సవ్యంగా ఉంటే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ను ఖాళీ చేయించి కాంగ్రెస్ బలాన్ని పెంచుకునే దిశలో హస్తం పార్టీ నేతలు సీరియస్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments