ఒకటే వానా.. మునిగిన కాలనీలు
స్పాట్ వాయిస్, హన్మకొండ: గ్రేటర్ వరంగల్ చెరువైంది. శుక్రవారం 12.30 నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కాలనీలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. ఒక్కసారిగి కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపాటి వర్షం పడినా.. నగరం చెరువులా మారడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Recent Comments