ఉద్యమాల గడ్డపై బీఆర్ఎస్ కు షాక్..
కాంగ్రెస్ బాట పడుతున్న కార్పొరేటర్లు
మేయర్‌పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: ఉద్యమాల గడ్డ ఓరుగల్లులో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు, నేతలు చేరేo దుకు హైదరాబాద్ వెళ్లారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. మంత్రి కొండా సురేఖ, కొండ మురళీతో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు టచ్‌లోకి వెళ్ళారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్ లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 66 కాగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది నాలుగుస్థానంలోనే. అయితే రాష్ట్రo లో.. కాంగ్రెస్ అధికారంలో కి రావడం, గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యే లే ఉండడం తో సగానికి పైగా కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Recent Comments