Friday, September 20, 2024
Homeతెలంగాణసర్పంచ్ ఎన్నికల్లో కదలిక..

సర్పంచ్ ఎన్నికల్లో కదలిక..

ఓట‌రు జాబితా త‌యారీకి షెడ్యూల్ రిలీజ్
స్పాట్ వాయిస్, బ్యూరో: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై రాష్ట్ర ప్రభుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఓట‌రు జాబితా త‌యారీకి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం బుధ‌వారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓట‌రు జాబితాను ప్రచురించ‌నున్నారు. ఈ జాబితాపై సెప్టెంబ‌ర్ 7 నుంచి 13వ తేదీ వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్నారు. 9, 10 తేదీల్లో రాజ‌కీయ పార్టీల నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రిస్తారు. సెప్టెంబ‌ర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించ‌నున్నారు. ఈ మేర‌కు ఓట‌రు జాబితా త‌యారీపై ఈ నెల 29న క‌లెక్టర్లతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ‌నుంది.

**సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
**ఓటరు జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13వరకు అభ్యంతరాలు స్వీకరణ
**సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రచురణ
**సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల సూచనలు స్వీకరణ
**ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments