ఆ భూమి గ్రామపంచాయతీకే..
స్పాట్ వాయిస్ కథనానికి స్పందన
లెంకాలపల్లి గ్రామపంచాయతీ విక్రయ భూమిపై స్పందించిన పంచాయతీ అధికారులు
హద్దులు ఏర్పాటు చేసిన అధికారులు
హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు
స్పాట్ వాయిస్ నల్లబెల్లి : స్పాట్ వాయిస్ పత్రికలో నేడు వచ్చిన లెంకాలపల్లి పంచాయతీ భూమి విక్రయం అనే కథనానికి పంచాయతీ అధికారులు ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి పాక ప్రశాంత్ స్పందించి భూమిలో ఉన్న ముళ్ళ చెట్లను జేసిబీ సాయంతో గ్రామస్తుల సమక్షంలో తొలగించారు. వెంటనే హద్దులు ఏర్పాటు చేసి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. గ్రామ పంచాయతీ భూమి పై అధికారులు వెంటనే స్పందించినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్పాట్ వాయిస్ పత్రికలలో కథనo రాసిన పత్రిక రిపోర్టర్ యాజమాన్యానికి, కృతజ్ఞతలు తెలిపారు.
Recent Comments