Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుజీపీ భూమినే అమ్మేశారు..

జీపీ భూమినే అమ్మేశారు..

15 లక్షల విలువైన స్థలం..
కేవలం లక్ష పదివేలకే ఇచ్చేశారు..
బీఆర్ఎస్ నేత మధ్యవర్తిత్వం..!
పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు..
నల్లబెల్లి మండలం లెంకాలపల్లిలో ఘటన
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో దారుణం జరిగింది. గ్రామ పంచాయతీ భూమినే అమ్మేశారు. సుమారు రూ.15లక్షల విలువైన భూమిని కేవలం లక్ష పదివేలకు అప్పగించేశారు. ఈ తతంగానికి బీఆర్ఎస్ లీడర్, మాజీ సర్పంచ్ మధ్యవర్తిత్వం వహించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామంలో 1996లో అప్పుడున్న లెంకాలపల్లి గ్రామ సర్పంచ్ కోమండ్ల రంగయ్య గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం గుర్రపు పెద్ద మల్లయ్య, పొనుగోటి సాంబయ్య వద్ద లెంకాలపల్లి మెయిన్ రోడ్ పక్కనున్న సర్వే నెంబరు ఒకటిలోని 3 గుంటల భూమిని 30-01-1996లో 8,148 రూపాయలకు కొనుగోలు చేశాడు. రూ. 2లక్షల పంచాయతీ బిల్డింగ్ ఎస్టిమేషన్ తో భవన నిర్మాణ పనులు చేపట్టగా.. డీబీఎం 38 కెనాల్ ఉప కాలువ 16 ఎల్ పక్కన ఈ భూమి ఉన్నందున గ్రామపంచాయతీ భవనం బేస్ మెంట్ ఉందంటూ ఎస్సారెస్పీ ఏఈ, డీఈలు సర్పంచ్ రంగయ్యపై, భవనం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పిట్టల సంపత్ పై కేసు వేశారు. దీంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయి బేస్ మెంట్ మీద గోడల నిర్మాణం కోసం ఎంబీ నెంబర్ 275/1996, ప్రభుత్వం నిధుల నుంచి సుమారు 34 వేల రూపాయలు విడుదల చేశారు. భవన నిర్మాణం ఆగిపోయేసరికి భూమిని గ్రామ పంచాయతీలో అడిట్ చేసి వేరే అవసరాల కోసం వాడుకుందామని అలాగే ఉంచారు. అయితే గ్రామానికి చెందిన బత్తిని చేరాలు, బత్తిని రాజయ్య అనే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన లెంకాలపల్లి మాజీ సర్పంచ్ మధ్యవర్తిత్వం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 15 లక్షల రూపాయల విలువైన చేసే గ్రామపంచాయతీ భూమిని లక్ష పదివేల రూపాయలకు పొనుగోటి రమణాచారి, పొనుగోటి సాంబయ్య నుంచి తాజాగా కొనుగోలు చేశారు. గ్రామపంచాయతీకి అమ్మిన పొనుగోటి సాంబయ్య అదే భూమిని వేరే వ్యక్తులకు అమ్మడం దారుణంగా మారింది. ఈ ఈ విషయమై శనివారం పంచాయతీ కార్యదర్శి పాక ప్రశాంత్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రూ.15 లక్షల విలువైన గ్రామపంచాయతీ భూమిని కాపాడాలని మామిండ్ల చిన్న ఐలయ్య యాదవ్ మాజీ వార్డ్ మెంబర్ లెంకాలపల్లి నల్లబెల్లి మండల కాంగ్రెస్ యువజన నాయకులు ఎంపీఓ, ఎంపీడీవో, డీఎల్ పీఓ, కలెక్టర్ ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments