గూడెం గ్రామ సభలో పాల్గొన్న ఎంపీఓ కూచన ప్రకాష్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయా గ్రామాల్లోని మల్టీపర్పస్ వర్కర్లకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా గూడెం గ్రామంలో సర్పంచ్ కవిత గ్రామ సభలో అధ్యక్షత వహించగా.., ఎంపీవో కూచన ప్రకాశ్ పాల్గొని మాట్లాడారు. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఎంచుకుని పంచాయతీరాజ్ దినోత్సవంలోగా లక్ష్యాలు నెరవేర్చుకునేలా ప్రణాళిక తయారు చేసుకోని అమలు చేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు పేదరికం లేని , ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, పంచాయతీ కార్యదర్శి పద్మనాభ స్వామి, ఉప సర్పంచ్ ,వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
RELATED ARTICLES
Recent Comments