Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్సర్కార్ వారి సవాల్..

సర్కార్ వారి సవాల్..

దమ్ముంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చండి..
మేమే మోడీ సర్కార్ ను కూల్చివేస్తాం..
ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఫైర్ అయిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ ప్రచారం చేశారని, అయినా అక్కడ ట్రంప్ ఓడిపోయారని చెప్పారు. అమెరికాలో జరిగే ఎలక్షన్స్ ను అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రచారం చేయడం కరెక్టేనా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జలవిహార్ లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, మోడీపై విరుచుకుపడ్డారు. ఇక్కడ మాటలు అధికం.. చేతలు స్వల్పమంటూ ఎద్దేవా చేశారు. 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ మాట్లాడుతున్నారని.. కానీ కేవలం 3.1 ట్రిలియన్ ఎకానమీ దగ్గరే ఉన్నామన్నారు. వెనక్కి తీసుకొస్తామన్న నల్లధనాన్ని ఎంత తీసుకొచ్చారని ప్రశ్నించారు. మోడీ హయాంలో రూపాయి విలువ ఎక్కడుందని సీఎం కేసీఆర్ నిలదీశారు. ప్రస్తుతం జనాల్లో ఆగ్రహం పెరుగుతోందన్నారు. రూ.18.60 లక్షల కోట్లు దేశంలో ఎన్ పీఏ ఉందన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇప్పటికీ 15 పైసలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు క్షీణించాయని విమర్శించారు. ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, డాట్సన్, హార్లే డేవిడ్ సన్ వెళ్లిపోయాయని, ఇదేనా దేశాన్ని పరిపాలించే పద్ధతి అని ప్రశ్నించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువులతో పాటు అన్నింటి ధరలను పెంచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు సరైనవే అయితే.. వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతాం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తాము సైలెంట్‌గా ఉండం, పోరాడుతూనే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ పడగొట్టాలని భావిస్తున్నారన్నారు. కాని దమ్ముంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చండి చూస్తాం అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. మేము ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని కూల్చుతామని, మీరు ఎంత అవినీతి చేశారో, మీ స్నేహితులైన వ్యాపారులకు ఎంత దోచి పెట్టారో మా దగ్గర లెక్కలున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ అవినీతి చిట్టా త్వరలోనే బయటపెడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. మోడీ అడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. ఎవరూ శాశ్వతం కాదని…మోడీ కంటే ముందు చాలామంది ప్రధానులు అయ్యారని చెప్పారు. మోడీ బ్రహ్మ కాదు ప్రధానిగా శాశ్వతంగా ఉండటానికి అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆరోపించారు. మోడీ పాలనలో (ఎన్డీయే) 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారని సీఎం కేసీఆర్ అన్నారు. టార్చ్ లైట్ పెట్టి వెతికినా మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు కనిపించడం లేదన్నారు. ఏ ఒక్క వర్గానికి మోడీ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments