అన్ని శాఖలను కోరిన ఆర్థిక శాఖ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ప్రభుత్వ స్పీడ్ పెంచింది. క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు అందజేయాలంటూ అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆర్థికశాఖ కోరింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అసెంబ్లీలో ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. 11 వేల పైచిలుకు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నారు.
కేసులు దాటుకొని..
రాష్ట్రం ఏర్పడిన అనంతరం2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్నిరాజకీయ పార్టీలు కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్ని తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్క చెప్పండి..
RELATED ARTICLES
Recent Comments