వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
తరలివచ్చిన భారీ జనం
స్పాట్ వాయిస్ నర్సంపేట: నర్సంపేట పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతమల్ల రంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సంపేట గెస్ట్ హౌస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది పేదలతో ర్యాలీ నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమం ప్రజా సంఘాల నాయకుడు హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతమల్ల రంగయ్య హాజరై మాట్లాడారు. నర్సంపేట పట్టణంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి, రోడ్లు, డ్రైనేజీ ఇతర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా.. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించేలదని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో పేదల వేసుకున్నా ఇళ్లకు పట్టాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. అదే ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తుంటే వారికి తొత్తులుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూము ఇల్లు ఇవ్వాలని, పేదల వేసుకున్న గుడిసెలను పట్టాలివ్వాలంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. అర్హులైన పేదలు రేషన్ కార్డులు ఇవ్వాలని ఏళ్లుగా అప్లికేషన్లు పెట్టుకున్నా…ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి, ఐద్వా జిల్లా నాయకురాలు గుజ్జుల ఉమా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నమిండ్ల స్వామి, ప్రజాసంఘాల నాయకులు ముంజల సాయిలు, హన్మకొండ సంజీవ, గడ్డమీది బాలకృష్ణ, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ, ఉదయగిరి నాగమణి, గనిపాక ఇంద్ర, జగన్నాథం కార్తీక్, బిట్ర స్వప్న, కలకోటి అనిల్, తాళ్లపల్లి ప్రవళిక, చిలక సారంగపాణి, లక్ష్మి,యాకలక్ష్మి విలియం కేరి, సింగారం బాబు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments