క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశం
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్టుగా ప్రకటించింది. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2016 ఫిబ్రవరి 26న 16వ నెంబర్ జీవోను జారీ చేసింది. అయితే ఈ జీవోపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థి ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన తీర్పును వెలువరించింది. దీంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగినట్లయింది. అడ్డంకులు తొలగడంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. ఇప్పటికే అర్హులైన కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది.
కాంట్రాక్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్..
RELATED ARTICLES
Recent Comments