Friday, September 20, 2024
Homeతెలంగాణరైతన్నలకు గుడ్ న్యూస్...

రైతన్నలకు గుడ్ న్యూస్…

కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
వారంలో తెలుగు రాష్ర్టాల్లోకి…
భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించే చల్లని వార్త వచ్చింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించినట్లు వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది త్వరగా భారత్‌లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి ముందుగానే అవి వస్తున్నట్టు వాతావరణ శాఖ కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. మే 27నే కేరళకు చేరుకుంటాయని అంచనా వేసినా.. రెండు రోజులు ఆలస్యంగా కేరళాను తాకాయి. కేరళలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటల్లో కేరళలోని మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. కేరళలో ప్రవేశించిన వారం రోజుల్లోనే రుతుపవనాలు ఏపీ, తెలంగాణల్లో విస్తరించనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments