జూన్ 5 నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని సూచించారు. జూన్ 5వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్
RELATED ARTICLES
Recent Comments