Monday, November 25, 2024
Homeకెరీర్టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

6 పేపర్లతోనే పరీక్షలు
కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవ‌త్సరం కూడా 11 పేప‌ర్లకు బ‌దులుగా 6 పేప‌ర్లే నిర్వహించాల‌ని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాద‌న‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా 2021లో 11 పేప‌ర్లకు బ‌దులుగా 6 పేప‌ర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు క‌రోనా ఉధృతి కార‌ణంగా ప‌రీక్షలు నిర్వహించ‌డం వీలు కాలేదు. 2022లో విద్యాశాఖ టెన్త్ ప‌రీక్షలు నిర్వహించింది. అప్పుడు 6 పేప‌ర్లకు కుదించి ఎగ్జామ్ రాయించారు. మ‌ళ్లీ తాజాగా 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఇకపై ప్రతి ఏడాది ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధివిధానాలు మారుస్తూ.. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్ 1 నుంచి పదో తరగతికి మొదటి సమ్మేటివ్ అసెస్మెంట్​ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. గ‌తంలో తెలుగు, ఇంగ్లిష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా, హిందీ ఒక పరీక్షగా నిర్వహించే వారు. కరోనా కార‌ణంగా వీటిని 6 పేప‌ర్లకే కుదించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments