Wednesday, November 27, 2024
Homeతెలంగాణబంగారంపై తీసుకున్న లోన్ల మాఫీ లేదు..

బంగారంపై తీసుకున్న లోన్ల మాఫీ లేదు..

బంగారంపై తీసుకున్న లోన్ల మాఫీ లేదు..
రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదు..
పాస్ బుక్ ఆధారంగానే మాఫీ
స్పాట్ వాయిస్, బ్యూరో: రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ కార్డు ప్రమాణికం కాదని.. కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని పేర్కొన్నారు. పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని తెలిపారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసా, ఇతర పథకాలపై దృష్టి పెడతామని వెల్లడించారు.పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి తప్ప.. బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ కాదని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments