Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎంతపనైపాయే..

ఎంతపనైపాయే..

అందమైన జుట్టు కోసం వెళ్తే..
ఉన్న జుట్టు ఊడింది..
ఊడిన జుట్టుతో పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ..
స్పాట్ వాయిస్, డెస్క్: అందంగా కనిపించాలనే ఆశ.. అందవిహీనం చేసింది. మోడల్ గా చూడాలనుకున్న భర్త కల.. భయంకరంగా మారింది. బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఆయిల్ రాయించుకుంటే.. ఉన్నజుట్టు ఊడింది. ఊడిన జుట్టుతో పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అందం కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఓ మహిళ విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ అందంగా.. స్టైల్‌గా కనిపించడం కోసమని పొడుగ్గా ఉన్న జుట్టుని కట్ చేయించుకోవడానికి అబిడ్స్ ఏరియాలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అక్కడి బ్యూటీషియన్ ముందుగా జుట్టుగా ఆయిల్ పెట్టి హెయిర్ కట్ చేసింది. అయితే ఆయిల్ పెట్టిన కాసేపటికే జుట్టు ఊడిపోవడం మొదలైంది. కాసేపటికే నెత్తిపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోగా.. కంగుతిన్న మహిళ ఇంటికి పరుగులు పెట్టింది. భార్య నెత్తిన జుట్టు లేకపోవడం చూసిన ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం బాధితురాలు తన ఊడిపోయిన జుట్టును పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తాను హెయిర్ కట్ కోసం వెళ్లిన బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments