ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లను ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఏ గ్రూప్‌లో 15 ఉప కులాలు ఉండగా.. వారికి 1 శాతం రిజర్వేషన్లు, బీ గ్రూప్‌లో ఉన్న 18 కులాలకు 9 శాతం, సీ గ్రూప్‌లో ఉన్న 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించిన ప్రభుత్వం
ఏ గ్రూపుకు 1%
బీ గ్రూపుకు 9%
సీ గ్రూపుకు 5 % చొప్పున రిజర్వేషన్లు
Recent Comments