Monday, April 14, 2025
Homeతెలంగాణవరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి

ప్రజల మద్దతుతో భారీ విజయాన్ని సాధిస్తాం
వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
కాంగ్రెస్ ముఖ్య నాయకుడు చిదంబరాన్ని కలిసిన రామకృష్ణ
స్పాట్ వాయిస్, బ్యూరో: వరంగల్ ఎంపీ టికెట్ రేసులో డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇప్పటికే రెండుమూడు సార్లు చుట్టేసిన ఆయన.. మిగత వారికన్నా ప్రచారంలో ముందున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ను డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని రామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, దీనికి చాలామంది నాయకులు కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి కష్టపడిన వారికి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎవరైతే జెండాలు మోసారో కేసుల పాలయ్యారో వారిని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని రామకృష్ణ కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ స్థానం నుంచి తనకి అవకాశం కల్పిస్తే ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వెలిబుచ్చారు. అదేవిధంగా వరంగల్ లో జరగాల్సిన అభివృద్ధి పనుల కోసం తాను కృషి చేస్తానని, పేద ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments