బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అశోక్
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు చీటూరి అశోక్ ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లిన అశోక్ అప్లికేషన్ ను సమర్పించారు. పార్టీ తన సేవలను గుర్తించి, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశమిస్తే.. వర్ధన్నపేటలో కాషాయజెండా ఎగురవేసి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికి నిత్యం అండగా ఉంటానని చెప్పారు. 2009లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన చీటూరి అశోక్ 2016 నుంచి 2018 వరకు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2019-20 మధ్య టీడీపీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షుడిగా సేవలందించారు. మోడీ పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై బీజేపీలో చేరిన అశోక్, అప్పటి నుంచి పార్టీకి తన వంతు సేవలందిస్తూ వస్తున్నారు. తాజాగా వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చే యడానికి ఉత్సాహపడుతున్నారు. ఆయన వెంట ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు ధర్మపురి వెంకన్న, వర్ధన్నపేట పట్టణ ఉపాధ్యక్షుడు చీటూరి రాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి
RELATED ARTICLES
Recent Comments