స్పాట్ వాయిస్, నెక్కొండ: ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని నెక్కొండ మండలంలోని ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం అందజేశారు. అనంతరం నెక్కొండ మండలంలోని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, స్థానిక సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments