Tuesday, November 26, 2024
Homeజాతీయంభారీగా గవర్నర్ల నియామకాలు..

భారీగా గవర్నర్ల నియామకాలు..

భారీగా గవర్నర్ల నియామకాలు..

బదిలీలు.., మార్పులు చేసిన రాష్ట్రపతి 

స్పాట్ వాయిస్, బ్యూరో :దేశంలోని అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ను నియమించారు ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్​కు సైతం కొత్త గవర్నర్​ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ను ఏపీ గవర్నర్​గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, లద్దాఖ్ ఎల్​జీగా ఉన్న ఆర్​కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్​ ప్రదేశ్ గవర్నర్​గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​, సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్​గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​గా శివ్ ప్రతాప్​లను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.మణిపుర్ గవర్నర్​గా ఉన్న లా గణేశన్​ను నాగాలాండ్ గవర్నర్​గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్​ను మేఘాలయా గవర్నర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ గవర్నర్​గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ను.. బిహార్ గవర్నర్​గా బదిలీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments