Saturday, November 23, 2024
Homeటాప్ స్టోరీస్గ్యాస్‌కు ముందు డబ్బులు కట్టాల్సిందే..

గ్యాస్‌కు ముందు డబ్బులు కట్టాల్సిందే..

రీయింబర్స్ మెంట్‌లో రూ.500 ఇవ్వనున్న ప్రభుత్వం
కేంద్రం సొమ్ముతో కలిపి రూ.500లు జమ 
రేపటి నుంచే మహాలక్ష్మీ స్కీం..

స్పాట్ వాయిస్, డెస్క్: కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకాన్ని (27వ తేదీ) రేపటి నుంచి అమలు చేసేందుకే అన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వారిని సైతం ఈస్కీమ్ లోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ పథకంలో లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్‌ చేయనున్నారు. ఇందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. సిలిండర్‌ ధర రూ.955 ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్రం రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ను రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘ఉజ్వల’ రాయితీ పోనూ మిగతా మొత్తం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 11 లక్షల 58 వేల ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వారికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ వస్తోంది. మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్‌పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోనూ మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. సిలిండర్‌ ధర రూ.970 ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోగా, మిగతా 130ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా జమ చేస్తుంది. జిల్లాల వారీగా పథకం లబ్ధిదారుల జాబితాను సోమవారం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments