సబ్సీడి సిలిండర్ల లెక్క ఫిక్స్.. ఏడాదికి ఇన్నే ఇచ్చేది..
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ ఇటీవలే రూ.500లకే గ్యాస్ పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే గ్యాస్ రాయితీ విషయంపై పౌర సరఫరాల శాఖ అర్హుల జాబితాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. సంవత్సరానికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ లెక్కన ఏటా గరిష్ఠంగా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 8గా తేలింది. మహాలక్ష్మి పథకానికి కొద్దిరోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా పౌర సరఫరాల శాఖ అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా సంవత్సరానికి 8 గ్యాస్ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌర సరఫరాల శాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్ఠంగా ఏడాదికి ఎనిమిదిగా పిక్స్ అయింది. మొత్తంగా రాష్ట్ర సర్కార్ భరించాల్సిన సబ్సిడీ నెలకు రూ.71.27 కోట్లు, సంవత్సరానికి రూ.855.2 కోట్లుగా తేలింది. ఇందులో ఉజ్వల కనెక్షన్ వినియోగదారులకు రూ.38.57 కోట్లు, సాధారణ గ్యాస్ కనెక్షన్‌దారులకు రూ.816.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
రూ.500లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తారో తెలుసా..?
RELATED ARTICLES
Recent Comments