Monday, April 7, 2025
Homeజిల్లా వార్తలుగణపురంలో ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు..

గణపురంలో ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు..

గణపురంలో

ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు..

స్పాట్ వాయిస్, గణపురం:దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ తో పాటు పలువురు మండల కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ దేనన్నారు. టెలీ కమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు చేసిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి భువనసుందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, గ్రామశాఖ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు పోశాల మహేష్ గౌడ్, బాల్యం కుమార్, నేరెళ్ల రాజు, వార్డు సభ్యులు ఓధాకర్, గణపురం యూత్ అధ్యక్షుడు దూడపాక పున్నం, కార్తీక్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments