స్పాట్ వాయిస్,గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం కేంద్రంలో గంజాయి తాగుతూ యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్సై అభినవ్ తన సిబ్బందితో పాత తహసీల్దారు కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. మండల కేంద్రానికి చెందిన పూజరి సాయి కమల్, గౌరిశెట్టి సాయితేజ అనే ఇద్దరు యువకులు బైక్ పై ప్రయాణిస్తూ అనుమానస్పదంగా కనిపించడంతో వారిని సోదా చేయగా వారి వద్ద ఉన్న సంచిలో సుమారు150 గ్రాముల గంజాయి బయటపడింది. దీంతో అ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి సేవించినట్లు ఒప్పుకోవడంతో వారి నుంచి మొబైల్ ఫోన్, స్కూటి, బైక్ స్వాధీన పరచుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి పరకాల సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. ఎవరైనా గంజాయి సేవించినా, మత్తు పదార్థాలు రవాణా చేసినా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Recent Comments