నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
– సమయానికి సర్పంచ్, ఎస్సై స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు కట్టపై మంటలు చెలరేగాయి. చెరువుకట్టపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కట్టపై ఉన్న చెట్లు తగలబడి పోయాయి. విపరీతంగా గాలి వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సరిగ్గా అదే సమయంలో గాంధీనగర్ గ్రామం నుంచి వస్తున్న సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ ను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ప్రమాద వ్యాప్తిని అరికట్టేందుకు ఫైర్ సిబ్బందికి ఉప సర్పంచ్ అశోక్ యాదవ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, సల్వాది సురేష్, బోయిని సాంబయ్య ముదిరాజ్ సహకరించారు. సమయానికి పోలీసులు, ప్రజా ప్రతినిధులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Recent Comments