మోహరించిన పోలీసులు
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పది రోజుల క్రితం ఎస్సై కొట్టడాని ఆరోపణలు చేస్తూ పురుగులు మందు తాగిన ప్రశాంత్ అనే యువకుడు చికిత్స పొందుతూ.. శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు, మృతుడు బంధువులు ధర్నా, ఆందోళనలు చేస్తారనే సమాచారం మేరకు గణపురంలో భారీగా పోలీసులు మోహరించారు. అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు. జనాలు పొగు కాకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే యువకుడి మృతి విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు మండలానికి వస్తున్నట్లు సమాచారం.
Recent Comments