గణపురం సొసైటీ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా
స్పాట్ వాయిస్, గణపురం:గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం పాలకమండలి చైర్మన్ ఎన్నికకు కో రం లేకపోవడం తో ఎన్నికను వాయిదా వేసినట్లు జిల్లా సహకార అధికారి శైలజ తెలిపారు. గత నెల12న గణపురం పీఏసీఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి పై అధికార కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ఈనెల 05న అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు నూతన ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియకు డీసీవో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా మెజారిటీ సభ్యులు హాజరు కాలేని కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా చేసినట్లు డీసీవో తెలిపారు.
Recent Comments