ఓఆర్ఆర్ పై యాక్సిడెంట్
ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి గాయాలు
స్పందించిన మంత్రి ఎర్రబెల్లి.. వెంటనే సహాయక చర్యలు
గంజాయితో పట్టుబడిన యువకుడు, మరో ఇద్దరి పరారీ..
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్ పై బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఘటనలో ఇద్దరు యువకులక స్వల్ప గాయాలయ్యాయి. కాగా జనగామ పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని ఆపి, సహాయక చర్యలు కోసం డీసీపీ తో పాటు ఇతర పోలీసు సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన ఇద్దరు యువకులు పారిపోవడంతో అనుమానంతో పోలీసులు మరో యువకుడి దగ్గర ఉన్న బ్యాగులో చెక్ చేయడంతో గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లారు. గాయపడిన యువకులను జనగామ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటన జరిగిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి ఫోన్ చేయడంతోనే సహాయక చర్యలు అందడమే గాక, గంజాయి ముఠాను పట్టుకోగలిగామని పోలీసు అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలో గంజాయి పట్టుబడటం ఆశ్చర్యంగా, ఆందోళనకరంగా ఉందన్నారు. యువకులు ఇలాంటి అలవాట్లకు బానిసలు కావడం ఇబ్బందిగా ఉందనిపిస్తోందన్నారు. యువత మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని సూచించారు. తనతో సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
గంజాయి పట్టుకున్న మంత్రి ఎర్రబెల్లి
RELATED ARTICLES
Recent Comments