Monday, May 19, 2025
Homeక్రైమ్అయ్యో.. ఎంతపనాయే..

అయ్యో.. ఎంతపనాయే..

వడ్ల బస్తాలో రూ.1.50లక్షలు దాచిన భర్త..
విషయం తెలియక.. ధాన్యం అమ్మేసిన భార్య..

స్పాట్ వాయిస్, గణపురం: ఎంత దారుణం. భర్త దాచిన సొమ్మును భార్య తెలియకుండా పొగొట్టేసింది. అనుకోకుండా జరిగినా.. పోయిన సొమ్ము పెద్ద మొత్తం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు పోతరాజు వీరయ్య ఇటీవల తన ఎడ్లను విక్రయించాడు. వచ్చిన డబ్బును దొంగల భయానికో.. లేదో మరోటో కాని.. వడ్ల బస్తాలో దాచి ఉంచాడు. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో గత బుధవారం వీరయ్య పని మీద పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలోనే ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారి ఉళ్లోకి వచ్చాడు. దీంతో వీరయ్య భార్య..తన ఇంట్లో ఉన్న వడ్లను అతడికి విక్రయించింది. కాసేపటి తర్వాత పొలం పనులు ముగించుకొని వీరయ్య ఇంటికి వచ్చాడు. ఇంట్లో చూడగా ధాన్యం బస్తా కనిపించలేదు. తీవ్ర ఆందోళనకు గురైన ఆయన బస్తా ఏమైందని భార్యను అడిగాడు. ఊళ్లోకి వడ్లు కొనేవాళ్లు వస్తే అమ్మేసానని చెప్పింది. దీంతో భార్యకు అసలు విషయం చెప్పగా.. లబోదిబో మన్నారు. వెంటనే ఆ వ్యాపారి కోసం గాలించగా.. ఎక్కడా అతగాడి ఆచూకీ లభించలేదు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ పోలీస్ స్టేషన్​కు పరుగు తీశారు. జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి వాహనాన్ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments