పండగపూట విషాదం..
చెరువులో మునిగి యువకుడు మృతి
చెల్పూర్ లో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం:ఉగాది పండుగ వేళ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చోటు చేసుకుంది. చెల్పూర్ గ్రామానికి చెందిన ఎల్దండి విజయ్ (26) స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు మత్తడిలో స్నానానికి వచ్చారు. ఈ క్రమంలో చిన్న మత్తడిలో కాలు జారీ పడిపోయాడు. విజయ్ కి ఈత రాకపోడంతో పాటు బండ మధ్యలో ఇరుక్కు పోవడం తో మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రేఖ అశోక్ ఘటనా స్థలానికి చెరుకొని రెస్క్యూ టీంను రప్పించి మృత దేహాన్ని బయటకు తీసి, పోస్ట్ మార్టం నిమిత్తం భూపాలపల్లి ప్రధాన హాస్పిటల్ కు తరలించారు. మృతుడు విజయ్ హైదరాబాదులో ప్రవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడని తెలిసింది. కాగా, పండగకి స్వగ్రామానికి వచ్చిన విజయ్ సరదాగా ఈత కోసం వచ్చి మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
Recent Comments