మాలల సింహగర్జన సభకు తరలి వెళ్లిన మాలలు
స్పాట్ వాయిస్, గణపురం: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన సభకు మాల సంఘం జిల్లా నాయకుడు, సభ ఇంచార్జ్ ముప్పిడి శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం గణపురం మండలం నుంచి పెద్దఎత్తున మాలలు తరలివెళ్ళారు. ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతిపెద్ద కుల జనాభా మాలలదేనని, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు మంది మాలలు ఉన్నారని, తమ జాతి ఆత్మగౌరవం కోసం, హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం మాలలంతా రాజకీయాలకు అతీతంగా సింహగర్జన సభకు తరిలి వెళుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం మండల నాయకులు రేవెల్లి వెళ్లి హరిప్రసాద్, గుండు నారయణ, బొల్లం రాజేందర్, గంపల రాజయ్య, పోతుల విజేందర్ గంపల వేణు, గంపల విజేందర్, గంపల శ్రీకాంత్, సాంబయ్య, మునేందర్, శంకరయ్య, గంపల స్వామి, బండారి రాజమౌళి, బొల్లం మధుకర్ తదితరులు ఉన్నారు.
Recent Comments