నెంబర్ ప్లేట్లేని వాహనాలపై కేసులు
స్పాట్ వాయిస్,గణపురం: వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చిట్యాల సీఐ వేణు చందర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని గాంధీనగర్ జంక్షన్ లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకొందరు వాహనదారులు వాహనాల నెంబర్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నెంబర్ ప్లేట్లు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాహనదారులపై ఉందన్నారు.ఈ సందర్భంగా సరైన వాహన ధ్రువ పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 13 వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట స్థానిక ఎస్సై అభినవ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Recent Comments