Thursday, September 19, 2024
Homeటాప్ స్టోరీస్7 తలలు, 14 చేతులు..

7 తలలు, 14 చేతులు..

తలలపై నాగ సర్పాలు..
70 అడుగులు మహా రూపం…
ఖైరతాబాద్ గణపతి విశేషాలు మీకు తెలుసా..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: వినాయక చవితి అంటే ఖైరతాబాద్ గణపతి గుర్తోసాడు. ఈ సారి 70 అడుగుల్లో వినాయకుడు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు అవుతున్నందున 70 అడుగుల పొడవుతో ప్రతిమను ఏర్పాటు చేశారు. సప్తముఖ మహాశక్తి రూపంలో లంబోదరుడు దర్శనం ఇస్తున్నాడు. ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి రూపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. గణపతి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలను నెలకొల్పారు. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువును ప్రతిష్టించారు. గతంలో సప్తముఖ మహా గణపతిని రూపొందించారు. ఈ సారి రూపొదించిన ప్రతిమ అందుకు భిన్నంగా ఉంది. ప్రపంచశాంతితోపాటు ప్రజలకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజాన సిద్దాంతి గౌరీభట్ట విఠల శర్మ సూచించారు. ఆ ప్రకారం కమిటీ, ప్రధాన శిల్పి రాజేంద్రన్ వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. వినాయకుడికి 7 తలలు, 14 చేతులు, తలలపై నాగ సర్పాలతో కలిసి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి ప్రతిమ నెలకొల్పారు. ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం 75 అడుగుల జంజం, 50 అడుగుల కండువాను సమర్పిస్తారు. ఒక్క రోజు ముందే ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులను అనుమతించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments