‘జీఎంఆర్ ‘లో ఫ్రెండ్ షిప్ డే..
సంబురాలు జరుపుకున్న అపార్ట్ మెంట్ వాసులు
స్పాట్ వాయిస్, హనుమకొండ : వడ్డేపల్లి లోని జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ లో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జీఎంఆర్ మిత్ర బృందం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. పరస్పరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మధ్యాహ్నం వరకు నివాసితుల ఆటలు, పాటలతో జీ ఎంఆర్ ప్రాంగణం హో రెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి రవీందర్, జీఎంఆర్ మిత్ర బృందం కొండూరి శ్రీనివాస్, ఆనంద్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments