ప్రాణ మిత్రులంటే వీరే…
మిత్రుడి మరణం తట్టుకోలేక.. ఉరి వేసుకున్న దోస్త్..
స్పాట్ వాయిస్, వరంగల్ :సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో కూడా కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు..ఎంత అంటే.. ఒకరికోసం మరొకరు ప్రాణాలు ఇచ్చేంత.. అయితే వరంగల్ లో ఓ స్నేహితుడు కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడగా..తట్టుకోలేక అతను కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన వరంగల్ కరీమాబాద్ లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ కి చెందిన దరిగెల సంపత్ కుమారుడు సంజయ్ (23) బుధవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.భా ర్య ఇంటికి రావడం లేదని తన ప్రాణ స్నేహితుడు గుండేటి జగదీశ్వర్ కొద్దిరోజుల క్రితం కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అప్పటి నుంచి స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని సంజయ్ త న తండ్రితో తరచూ వాపోయేవాడు. తట్టుకోలేక పోతున్న అని బాధపడుతుండే వాడు. ఈ క్రమంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కుమారుడి మరణం పట్ల ఎవరిపైనా అనుమానం లేదని మృతుడి తండ్రి దరిగెల సంపత్ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments