సోనియా పుట్టిన రోజు నుంచి రెండు గ్యారంటీలు ప్రారంభం
మొట్టమొదటి క్యాబినేట్ నిర్ణయం
రేపు అధికారులో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
వెల్లడించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్
స్పాట్ వాయిస్, బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లుండి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం కల్పించనుంది. సోనియా పుట్టిన రోజైన డిసెంబర్ 9 నుంచి గ్యారెంటీలను అమలు చేయాలని నూతన కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం గురువారం సాయంత్రం సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలు,తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ లో ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించామన్నారు. 2014-2023 డిసెంబర్ 7 వరకు ఆర్థిక వ్యవహారాలు, అన్ని విభాగాలకు సంబంధించి ఖర్చుల వివరాలు తెలియయాలన్నారు. ముఖ్యంగా రెండు ప్రధాన గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించామని, సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9న వాటిని అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు గ్యారంటీని సైతం అదే రోజు నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆయా విభాగాల అధికారులతో రేపు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష చేస్తారని, రైతులకు 24గంటల కరెంటుతో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై చర్చిస్తామన్నారు. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు
ఎల్లుండి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం
RELATED ARTICLES
Recent Comments