Friday, November 22, 2024
Homeజనరల్ న్యూస్ఫ్రీ కరెంట్ కు ఇలా చేస్తేనే మీరు అర్హులు..

ఫ్రీ కరెంట్ కు ఇలా చేస్తేనే మీరు అర్హులు..

ఫ్రీ కరెంట్ కు దరఖాస్తు చేసుకున్నారా..?
మార్చి నుంచే ఉచిత విద్యుత్
మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కార్
స్పాట్ వాయిస్, బ్యూరో: ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేయనున్నారు. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
*ఈ పథకానికి రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నారు.
*ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌కార్డు, ఆధార్‌, కరెంటు కనెక్షన్‌ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు.
* 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్‌ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు.
*ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీకల్లా ప్రభుత్వం రాయితీ కింద డిస్కంలకు చెల్లిస్తుంది.
*ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల.. ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్‌ చట్టం కింద, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటారు.
* ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు తమ కరెంటు కనెక్షన్‌ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీవో, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తులు అందజేసిన తర్వాత కార్యాలయాల్లో రసీదు ఇస్తారు.
*దాన్ని సమీపంలోని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
*అనంతరం దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్‌ సిబ్బంది వెళ్లి.. రేషన్‌కార్డు, ఆధార్‌ వివరాలను తనిఖీ చేస్తారు.
* అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు.
* ఇది నిరంతర ప్రక్రియ

RELATED ARTICLES

Most Popular

Recent Comments