ఫ్రీ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట నియోజవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. నెక్కొండ రోడ్ లోని రెడ్డి పంక్షన్ హాల్ లో ఆదివారం ఎమ్మెల్యే తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా 12 వందల మంది ఈ ఫ్రీ-కోచింగ్ కోసం అప్లై చేసుకున్నారన్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా 60 రోజుల పాటు తరగతులు జరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు గతంలోను ఫ్రీ కోచింగ్ నిర్వహించగా 16 వందల మంది రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారన్నారు. అందులో 270 మంది కానిస్టేబుల్, బ్యాంకింగ్ ఇతర ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా శిక్షణ శిబిరాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగ పంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, సీఐ రమేష్, విన్నర్స్ అకాడమీ రాజి రెడ్డి పాల్గొన్నారు.
Recent Comments