స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: మామునూర్‌లోని నాలుగో బెటాలియన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్’ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగా అండ్ స్ట్రెస్ మేనేజ్ మెంట్ నిపుణుడు టి.రమణ ప్రసాద్ 4వ బెటాలియన్ కమాండెంట్, సిబ్బందితో యోగా ఆసనాలు వేయించారు. అనంతరం మాట్లాడుతూ.. యోగాతో శరీరాన్ని మనసుతో అనుసంధానించడం ద్వారా ఒత్తిడి నివారించి దైనందిన జీవనంలో సత్ఫలితాలను పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సిబ్బంది విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు యోగా మంచి సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీ, అడిషనల్ డీజీపీ టీఎస్ఎస్ పీ బెటాలియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు వేణుగోపాల్ రెడ్డి, జయరామ్, రాంబాబు ఆర్ఐలు చంద్రన్న, పురుషోత్తం రెడ్డి, నాగేశ్వరరావు, రాజ్ కుమార్, అశోక్, ఆర్ ఎస్సై అనిల్, యోగా వాలంటీర్లు రవీందర్, రోజా రాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments