Saturday, April 5, 2025
Homeరాజకీయంఏడు పదుల వయసులో ఏం మాట్లాడుతున్నావ్..

ఏడు పదుల వయసులో ఏం మాట్లాడుతున్నావ్..

ఏడు పదుల వయసులో ఏం మాట్లాడుతున్నావ్..
ఎమ్మెల్యే కడియంకు మాజీ ఎమ్మెల్యే పెద్ది కౌంటర్..
స్పాట్ వాయిస్, ఓరుగల్లు:  ఏడుపదుల వయస్సు దాటిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం కడియం చేసిన వ్యాఖ్యలకు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అవినీతికి పాల్పడాడని కడియం శ్రీహరి చెబుతున్నాడని, ఆయన సైతం కేసీఆర్ వెంట, సర్కార్ లోనే ఉన్నారని, ఆయన ఎంత అవినీతి చేశారో చెప్పాలన్నారు. అధికారం కోసం పార్టీలు మరే కడియం బీఆర్ఎస్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. కాంగ్రెస్ కు జీవితంలో ఓటు వేయనుని ప్రకటించిన కడియం శ్రీహరి.. తన కూతురుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారని, మరి ఆయన తన కూతురికి ఓటు వేసినట్టా లేదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ సర్కార్ లో కీలక నేతగా ఉన్నారని, ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్ సర్కార్ లో అవినీతి జరిగితే దానిలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లేనని, దీనికి ఆయన ఒప్పుకోవాలన్నారు. సీనియర్ నేత అయిన కడియం ఆలోచించి మాట్లాడాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments