తొండలెక్కిస్తానని తొండెక్కించుకున్నడు..
మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కమిజ్ లో సొచ్చిన తొండ
రైతు ధర్నాలో నవ్వులు పూయించిన ఘటన
స్పాట్ వాయిస్, తొర్రూరు: తాటికొండ రాజయ్య మాట్లాడుతుండంటేనే నవ్వులు పూస్తాయి. ఇక రాజయ్య మాటలకు తొండ తోడైతే.. అక్కడ నవ్వులే నవ్వులు. తాజాగా రాజయ్య కమిజ్ లోకి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న సమయంలో.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ తొండ స్టేజిపైకి దూసుకొచ్చింది. అంత మంది ఉన్నప్పటికీ ఏమాత్రం బయపడకుండా వచ్చిందో.. అంతమందిలో ఎటు వెళ్లలేక ఆగమై వచ్చిందో గానీ.. నేరుగా స్టేజీ మీదికి మాత్రం దూసుకొచ్చింది. అప్పటికే స్టేజీ మీద హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆ పక్కనే సత్యవతి రాథోడ్, మాలోతు కవిత కూర్చొని ఉండగా.. వారి మధ్యలో నుంచే ఆ తొండ నేరుగా.. రాజయ్య పంచపై నుంచి పరుగులు తీసింది. ఈ క్రమంలో తొండ ఆయనపైకి వస్తుందని మిగతా వాళ్లు చెప్పగా.. “ఆ తొండలు మనల్ని ఏం చేస్తాయ్..” అంటూ తాటికొండ రాజయ్య డైలాగ్ చెప్పాడు. ఆయన నవ్వుతూ చెప్పిన డైలాగ్‌ను ఆ తొండ విన్నదో ఏమోగాని.. రాజయ్య పంచ పట్టుకొని నేరుగా షర్టులోకి దూరి.. భుజంపైకి దూసుకొచ్చింది. అది గమనించిన రాజయ్య.. అటు ఓ చేత్తో మైక్ పట్టుకుని డైలాగ్ చెప్తూనే.. మరో చేత్తో ఆ తొండను దొరకబట్టారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. సభ అయ్యే వరకు ఘటనే గుర్తచేసుకుంటూ వచ్చిన వారంత నవ్వుకున్నారు.
తాటికొండపైకి తొండెక్కింది..
RELATED ARTICLES
Recent Comments