న్యూజిలాండ్ కు గ్రూప్-1పేపర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 పేపర్ దేశం దాటినట్టు సిట్‌గుర్తించింది. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి.. న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌రెడ్డికి వాట్సాప్‌లో పేపర్‌షేర్ చేసినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. ప్రశాంత్‌రెడ్డి పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. ఇతనికి 103 మార్కుల కంటే ఎక్కువగా వచ్చాయి. ఇతడికి సిట్ విచారణకు హాజరుకావాలని వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం అందించింది. అయితే సిట్ నోటీసులకు ప్రశాంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. దీంతో లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. న్యూజిలాండ్‌లోనే పరీక్షకు ప్రిపేర్ అయిన ప్రశాంత్‌రెడ్డి.. ఇక్కడికొచ్చి పరీక్ష రాశాడు. ప్రశాంత్ ద్వారా మరికొంత మందికి పేపర్ చేరి ఉంటుందని సిట్ అనుమానిస్తోంది.
బావ కళ్లల్లో ఆనందం కోసం..
RELATED ARTICLES
Recent Comments